Friday, May 15, 2009

Day 2

ఇది నా బ్లాగులో రెండవ పోస్టు.

ఒకసారెప్పుడో, మేము కొంతమంది స్నేహితులం(, రాళ్ళం) కూర్చుని పెళ్ళి గురించీ మాట్లాడుకుంటూ, భార్య భర్తల మధ్య ప్రేమ అనేది లేకపోతే ఆ పెళ్ళి సజావుగా సాగదని కొంతమందీ, ప్రేమ అవసరమే లేదని కొంతమందీ argue చేస్కున్నాము. అప్పటికీ నా పెళ్ళి ఐపోయింది, కాస్త కొత్తల్లో అన్నమాట. పెద్దలు కుదిర్చిన పెళ్ళి. అలా వెంటనే ప్రేమ ఏం పుట్టుకొస్తుందీ? అందువల్ల నేకూడా, ప్రేమ అవసరం లేదు. అర్థం చేసుకునే మనస్తత్వం, సరి ఐన communication, కాస్త sense of humor ఇలంటివి ఉంటే చాలునని వాదించాను.

ఇప్పుడు తను ఈ వ్యాధితో (బాధ పడుతుంటే?), నన్ను పెడుతూంటే అనిపిస్తోంది. అన్నీ సవ్యంగా జరుగుతున్నంత కాలం తెలీదు గానీ, ఇలాంటప్పుడు మాత్రం, ఆ మనిషి మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప, కుదరదు. ఇలాటి ప్రేమ aspect ఒక్ఖ spouse తోనే వస్తుంది. అదే తమ్ముడో, కూతురో, తల్లో ఐతే యెలాంటి ఆలోచనా లేకుండా వాళ్ళనీ, వాళ్ళ భయాల్నీ, schizophreniaనీ, సర్వం accept చేసేస్తాం. మరెందుకు భార్య/భర్త దగ్గర ఇలా అంటే, బహుసా, spouse నుండీ కోరేది తోడు అవడం వల్లనేమో. నేనింకా ఈ ప్రశ్న దగ్గరే ఆగిపోయాను.

బాధ పడుతూంటే కి question mark ఎందుకంటే అతని ప్రస్తుత మానసిక పరిస్థితిలో అతను బాధ పడుతున్నాడో లేడో నాకు తెలియదు. Doctorగారికి కూడా తెలీదుట! అతని పరిస్థితి, ఆ hallucinations, అందువల్ల అతను మాట్లాడే మాటలూ, చేతలూ - ఇవి నాకు చాలా బాధాకరంగా ఉంటాయి. ఒక్కొక్కసారి అనుమానం (because of the disorder), నేను దేనికన్న NO అంటే, ఎవరో నా ద్వారా అలా చెప్పిస్తున్నారేమో అనీ "నిజంగా నువ్వే అంటున్నావా? నీకు ఎవరు చెప్తున్నారు ఇలా అనమని?" అంటూంటే ఏమని చెప్పడం? ఇతని వ్యాధి ఇలా మాట్లాడిస్తోంది అని ఎన్నిసార్లు నాకు నేను చెప్పుకున్నా ఎప్పటికప్పుడు చాలా చాలా బాధగా ఉంటుంది. దుర్భరమైన పరిస్థితి.

All this is because, yesterday night, we had an episode. I don't know how long this will continue.

OK. Times up. More again, this time on a positive note, hopefully.

1 comment:

  1. madam...mee blog chadivaanu....i am sorry...kaani mee support aayanaku ento avasaram..emduku ilaa ayyimdi amte...daaniki ans manadaggara ledu kadaa....amthe...so, meeru discourage avvakamdi...nenu ivvanni enduku chebutunnaa amte....schizophrenia to suffer ayye oka ammaayi naa close friend college lo umdagaa...so aa pain naaku telusu....mumdu meeru discourage avvakamdi...hallusinations untaayi..just support him amdi...idi naa mail id(winjoy@rocketmail.com)....bye amdi...empecting more postings....(veelaite daily raayamdi) it will helps as feedback...

    ReplyDelete