Fear, disappointment, dislike, frustration, sadness, headaches, these and a myriad emotions surround me. He seems OK now. The doc has reduced his dose further. His visits are a monthly now. He is back to work. But something has changed. Something has snapped between us. May be from my side alone. I may never again talk to him openly. Say whatever I want to, however I want to. I have to be on guard always. Be careful of what I say, as I don't know what might trigger an episode again. I sometimes wish he had some other health condition, if he has to have one. One that wouldn't interfere with his moods. Not for my convenience. But..for the sake of our relationship. For our kids. I am very scared now, and a lot confused. I feel I don't have enough strength to raise two peaceful kids. I yell at them at the slightest mistake. They are too young. way too young. I shouldt be doing that. I shouldn't. God, give me strength. Hope. I am losing hope. I just dont see any positive sign in my life.
దేన్ని చూసి హోప్ తెచ్చుకోవాలి? At some time, I used to think, children give that strength and a purpose to a person, to live and fight. But for me, since a few months, life has become a burden. I can't think of anything else, except for his illness, how it has changed everything, changed me. I can't bear this burden anymore.
పిల్లల్ని అమ్మ దగ్గరికి పంపేస్తే వాళ్ల మీద ఈ ఎఫెక్ట్ ఉండదేమో అని ఒకసారి... వాళ్లు ఎదురుగా లేకపోతె ఏదైనా చేస్కుంతానేమో అనే భయం ఒకపక్క. ఒక్కోసారీ నిద్రపట్టదు. ఎంతకీ. రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు...వారం .... దాంతో చిరాకు, పిల్లల మీద. నా మీద నాకే కోపంగా ఉంది. ఎందుకు నాకంత మనోబలం లేదు?? ఎంత తెచ్చుకుందామనుకున్నా రావట్లేదు. ఏడవకూడదని ఎంత అనుకున్నా, ఆగదోకోసారి. నా మీద నాకే జాలి. అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు! పిల్లల్ని ఇలా పెంచడం ఇష్టంలేదు నాకు. చాలా సున్నితంగా, పువ్వుల్లా పెంచాలి అనుకునేదాన్ని. ఇప్పుడు ఎవరిని చూసినా, దేన్ని చూసినా, ఎవరేం మాట్లాడినా చిరాకు, విసుగు.
ఎంత అసహ్యం. ఇంత బాధ్యతలేని తనం. ఈ ఆలోచనల్ని ఎలా ఆపటం? రేపు బావుంటుంది అనే ఆలోచన రావట్లేదు. అసలు ఎలా బావుంటుందో అర్థం కావట్లేదు. మళ్ళా ఇలాంటి ఎపిసోడ్ రాదనీ ఏముంది? ఇంక ఇలాంటివి తట్టుకోడం నా వల్ల కాదు. అసలు మళ్ళా ఇలా అన్న ఆలోచన వస్తేనే చాలు, నాకు భయం, కాళ్ళూ చేతులూ వణుకు! ఏదో చేయాలి, ఈ వణుకు ఆపడానికి. లేచి అటూ ఇటూ నడిచినా తగ్గలేదు. ఏం చేయాలి ? పోనీ ఎవరితోనన్నా మాట్లాడదామా అంటే, ఏవని మాట్లాడటం? ఏవిటి చెప్పటం? చెప్పి ఉపయోగం? నా చుట్టూ అందరూ సుఖంగా నవ్వుకుంటూ ఉన్నట్టుగా, నేనొక్కర్తినీ విడిగా ఒక బుడగలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. సంతోషం, ఆశ్చర్యం, ఆనందం, నవ్వు, మాట - ఇలాన్టివేమీ లేవు. Just eternal sadness. a very stagnated life. జీవితం ఎక్కడో ఆగిపోయినట్టుగా ఉంది. నిశ్శబ్దం, స్తబ్దత. వీటిలో పిల్లలెలా పెరుగుతారు? వీళ్ళకి కూడా రేప్పొద్దున్న ఇలాంటి రోగాలు వస్తాయా? ఈ ఆలోచన కి ఓ పదిహేను రోజుల నిద్ర. దీనంతటికీ అంతు నా అంతం మాత్రమె. మరోటి లేదు. ఎన్నిసార్లు వద్దనుకున్నా,ఈ ఆలోచనని ఆపటం నాకు రావట్లేదు.
దేవుడెందుకో గత ఫదేళ్ళుగా నా వైపు చూడటం, నా మాట వినడం మానేసాడు.
Monday, August 31, 2009
Subscribe to:
Posts (Atom)