Monday, May 18, 2009

Day 3

Today we went for another doctor visit. 4th this month, already. He says, he still hears voices, have wrong perceptions, is still hallucinating and so on... and then, increased the dosage. Well, should I be happy that he still is below the maximum dosage?
Honestly, I was. So, we still have hope.

I know, things like this well take their own time. But, 5 years is a long time. Very Very v..e..r..y long time. I don't know about others who are in the same situation. I wish I knew, and I wish how they dealt with it. There is a nice website on schizophrenia (http://www.schizophrenia.com/). But like with anything on the web, there are both +ve and -ve sides to it.

Also, most of the users there are Americans. And I think, cultural differences matter when it comes to dealing with mental illnesses. We come from a conservative background, don't have our family or any support system here and if such illnesses gobble us up, we just don't know what to do.

పోనీ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడదామా అంటే ఇల్లాంటివి పెద్దవాళ్ళు, వాళ్ల B.P లతో ఎలా తీసుకుంటారోననే భయమూ, ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి. ఇలాగ ఐదేళ్లు గడిచిపోయాయ్.

Sometimes, I really appreciate the American society. They are far more tolerating than us when it comes to such mental illnesses. Probably, because they do more research or బహుశా, ఇక్కడి పిచ్చి జనాభా ఎక్కువేమో. :) ఏదేమైనా, ఇదే పరిస్థితి మన దేశంలో ఐతే, జనాలు ఈ పాటికి మమ్మల్ని వేలేసేవాళ్ళేమో.

Anyway, with all this going on, he went to office today, after a very very long time. I am just keeping my fingers crossed. భగవంతుడా, ఏ రభసా జరగకుండా చూడు తండ్రీ.
--------------------------------------------------------------------------------------------
joy గారూ, మీ పోస్ట్ కి ధన్యవాదాలు.

Friday, May 15, 2009

Day 2

ఇది నా బ్లాగులో రెండవ పోస్టు.

ఒకసారెప్పుడో, మేము కొంతమంది స్నేహితులం(, రాళ్ళం) కూర్చుని పెళ్ళి గురించీ మాట్లాడుకుంటూ, భార్య భర్తల మధ్య ప్రేమ అనేది లేకపోతే ఆ పెళ్ళి సజావుగా సాగదని కొంతమందీ, ప్రేమ అవసరమే లేదని కొంతమందీ argue చేస్కున్నాము. అప్పటికీ నా పెళ్ళి ఐపోయింది, కాస్త కొత్తల్లో అన్నమాట. పెద్దలు కుదిర్చిన పెళ్ళి. అలా వెంటనే ప్రేమ ఏం పుట్టుకొస్తుందీ? అందువల్ల నేకూడా, ప్రేమ అవసరం లేదు. అర్థం చేసుకునే మనస్తత్వం, సరి ఐన communication, కాస్త sense of humor ఇలంటివి ఉంటే చాలునని వాదించాను.

ఇప్పుడు తను ఈ వ్యాధితో (బాధ పడుతుంటే?), నన్ను పెడుతూంటే అనిపిస్తోంది. అన్నీ సవ్యంగా జరుగుతున్నంత కాలం తెలీదు గానీ, ఇలాంటప్పుడు మాత్రం, ఆ మనిషి మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప, కుదరదు. ఇలాటి ప్రేమ aspect ఒక్ఖ spouse తోనే వస్తుంది. అదే తమ్ముడో, కూతురో, తల్లో ఐతే యెలాంటి ఆలోచనా లేకుండా వాళ్ళనీ, వాళ్ళ భయాల్నీ, schizophreniaనీ, సర్వం accept చేసేస్తాం. మరెందుకు భార్య/భర్త దగ్గర ఇలా అంటే, బహుసా, spouse నుండీ కోరేది తోడు అవడం వల్లనేమో. నేనింకా ఈ ప్రశ్న దగ్గరే ఆగిపోయాను.

బాధ పడుతూంటే కి question mark ఎందుకంటే అతని ప్రస్తుత మానసిక పరిస్థితిలో అతను బాధ పడుతున్నాడో లేడో నాకు తెలియదు. Doctorగారికి కూడా తెలీదుట! అతని పరిస్థితి, ఆ hallucinations, అందువల్ల అతను మాట్లాడే మాటలూ, చేతలూ - ఇవి నాకు చాలా బాధాకరంగా ఉంటాయి. ఒక్కొక్కసారి అనుమానం (because of the disorder), నేను దేనికన్న NO అంటే, ఎవరో నా ద్వారా అలా చెప్పిస్తున్నారేమో అనీ "నిజంగా నువ్వే అంటున్నావా? నీకు ఎవరు చెప్తున్నారు ఇలా అనమని?" అంటూంటే ఏమని చెప్పడం? ఇతని వ్యాధి ఇలా మాట్లాడిస్తోంది అని ఎన్నిసార్లు నాకు నేను చెప్పుకున్నా ఎప్పటికప్పుడు చాలా చాలా బాధగా ఉంటుంది. దుర్భరమైన పరిస్థితి.

All this is because, yesterday night, we had an episode. I don't know how long this will continue.

OK. Times up. More again, this time on a positive note, hopefully.

Tuesday, May 12, 2009

Day 1

I am writing this blog as a vent to my feelings - fear, confusion and a range of emotions caused by my spouse's illness.

Today, he wanted to log in to his work remotely, but did not. He was scared that somebody has bugged his computer. I don't know how long it will take this time for him to get to some kind of normalcy. But it is taking a toll on me, especially with two toddlers and a sick husband.